పర్వతాల శివాలయం ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శనివారం పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ గొప్ప కార్యక్రమం కోసం నడుం బిగించిన కల్లెడ రామ్మోహన్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు. శుభాకాంక్షలు అన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. 850 ఏళ్ల నాటి జీర్ణావస్థలో ఉన్న శివాలయాన్ని పునర్ ప్రతిష్ఠ చేయడం గొప్ప విషయం. జీర్ణావస్థలో ఉన్న ఒక్క దేవాలయం పునర్ ప్రతిష్ట చేయడం అంటే, 100 కొత్త దేవాలయాలకు నిర్మించినట్లు సమానం. అంత గొప్ప ప్రతిష్ఠ. కాకతీయుల నాటి ఈ దేవాలయం పునర్ ప్రతిష్ట చేయడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్ర ప్రజలందరికీ ఆ శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. రామ్మోహన్ రావు లాంటి వారు ఎంతోమంది ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సొంత డబ్బులతో తమ సమయాన్ని వెచ్చించి మనసును బెట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కోరిక మేరకు ఈ ప్రాంతం పుణ్యక్షేత్రము గా అభివ్రుది చేసేందుకు కృషి చేస్తాం. అందరం కలిసి సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.

ఆనాటి జీర్ణ దేవాలయాలను పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. యాదాద్రి, కోటి లింగాల, వేములవాడ దేవాలయాలు అభివృద్ది చేస్తున్నారు. జీర్ణవస్థలో ఉన్న అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. కొంతమంది పెదవులతో మాట్లాడితే, సీఎం కేసీఆర్ గారు హృదయంతో పని చేస్తారు. ఆ శివుడి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ది కావాలి. రాష్ట్ర ప్రజలకు, సీఎం కేసీఆర్ కు శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్న అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..

కాకతీయులు కట్టిన శివాలయాలు జిల్లాలో చాలా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకువచ్చారు. రామప్ప, లక్నవరం, వెయ్యి స్తంభాల గుడినీ అభివృద్ధి చేశారు. ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలనీ కోరుతున్నా. ఇందుకు హరీశ్ రావు గారు చొరవ చూపాలని కోరుతున్నా. 850 ఏళ్ల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. టూరిజం హబ్ గా ఈ ప్రాంతం కావాలని కోరుతున్నా. ఈ ప్రతిష్టాపన కోసం ఎంతో మంది కష్టపడ్డారు. వేద పండితులు కృషి చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.