మందుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మందుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. బీజేపీ పాలనలో అచ్ఛేదిన్ కాదు.. పేదలు సచ్ఛేదిన్‌ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12 శాతం పెంచడం దారుణమని, కేంద్రం నిర్ణయం సామాన్యులకు వైద్యాన్ని దూరం చేయడమేనని హరీష్‌రావు విమర్శించారు. మందుల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందని మంత్రి హరీష్‌రావు అన్నారు.ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని హరీష్‌రావు తెలిపారు. అర్హులైనవారు వ్యాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని, అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణకు మరిన్ని వ్యాక్సిన్‌ డోసులు సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790కి పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు.. ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, తాము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా.. ములుగు, సంగారెడ్డిలో తమ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తామని ఒక్కటి కూడా ఇవ్వలేదని… దీనిపై నాటి మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారని మంత్రి గుర్తుచేశా

Leave A Reply

Your email address will not be published.