మంత్రి కేటీఆర్ ని తక్షణమే బర్తరఫ్ చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజ్ కి బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ని తక్షణమే బర్తరఫ్ చేయాలని చిలుక మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ పట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. ఒకవైపు కేసీఆర్ నోటిఫికేషన్లు మరోవైపు కేటీఆర్ లీకుల తో TSPSC కమిషన్ కల్వకుంట్ల కుటుంబ కమిషన్ గా మారింది అన్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు TSPSC పేపర్ లీకేజీ ఘటన నీ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలని దానికి బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపడం జరిగింది.అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి పాత్ర ఉందని ఇంటి దొంగలు బయటపడతారని కేటీఆర్ హడావుడిగా బయటకు వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మంత్రి కేటీఆర్ గారికి ఏమాత్రం విశ్వాసం ఉన్న తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని అట్టి కుటుంబాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత నిరుద్యోగులపై ఉందని తెలియజేశారు.ఈ సందర్భంగా గవర్నర్ చొరవ తీసుకొని మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని,ఇట్టి లీకేజ్ ఘటనపై సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని తెలియజేశారు.TSPSC కమిషన్ నీ సైతం కల్వకుంట్ల కుటుంబానికి రాబడి కమిషన్ గా మార్చారని ఎద్దేవా చేశారు..ఈ సందర్భంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంకాల దాసు..పట్టణ అధ్యక్షులు ఆకుల ఆనంద్..కౌన్సిలర్ పంది శంకరయ్య..తోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్..మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్.. తాళ్ల బాలశివుడు గౌడ్..బోసుపల్లి వీరేష్ కుమార్ ..లక్కరాజు ప్రశాంత్ కుమార్.. మంకాల కరుణాకర్..NSUI అధ్యక్షులు నందకిషోర్..కార్తీక్..కొత్తకురుమ కుమార్.. దొంతరమొలి రాజు రవి నాయి బ్రాహ్మణ..జలమోని వెంకటేష్..పంది యాదయ్య..పోచారం శివ.. కిరణ్..మహేష్..జమాల్ పూర్ శ్యామ్..సాయితేజ..నరసింహ తోపాటు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నార

Leave A Reply

Your email address will not be published.