నాడెం చెరువు రుణాల మంజూరు వెనుక మంత్రి, ఎమ్మెల్సీ హస్తం?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చెరువుపై 3 బ్యాంకులలో సుమారుగా 40 కోట్ల రూపాయల రుణాన్ని పొందిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో పలువురు విస్తుపోయారు.హైదరాబాద్‌ నగరంతో పాటు మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా రుణాల మంజూరు వెనుక ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్సీ తెర వెనుక ఉండి ఈ రుణాలను మంజూరు చేయించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఈ చెరువు వద్దకు గ్రామస్థులు, ముదిరాజ్‌లు వెళ్ళినప్పుడు కొంతమంది బడా నాయకుల అనుచరులు ఫోన్లు చేసి వారిని బెదిరించిన సందర్బాలు సైతం లేకపోలేదు. అధికారపార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందంటూ ప్రధానంగా వెంకటాపూర్‌ గ్రామస్థులు బాహాటంగా పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ఈ రుణాల మంజూరుపై తెలంగాణ జ్యోతి వెబ్‌న్యూస్‌ ప్రతినిధి బృందం సమగ్ర విచారణ చేసి ఈ రుణాలకు సంబందించి పలు కీలక మార్టిగేజ్‌ పత్రాలను

సేకరించి సంబందిత మూడు బ్యాంకులలో రుణాల మంజూరుపై ఆరా తీయగా మణికొండ బ్రాంచిలో 40 లక్షల రుణం పొందిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కరోనా విజృంబన సమయంలో మృతిచెందినట్లు తెలిసింది. అదేవిధంగా కూకట్‌పల్లి, చిక్కడపల్లి బ్రాంచిలలో రుణాల మంజూరుపై బ్యాంకు అధికారులను సంప్రదించగా రుణాలకు సంబందించి ఎలాంటి విషయాలను బ్యాంకు నిబందనల ప్రకారం బయటకు వెళ్ళడిరచలేమని, ఏదైనా సమాచారం కావాల్సి వస్తే రీజనల్‌ బ్యాంచిని సంప్రదించాలని చెప్పడం గమనార్హం. సంబందిత బ్యాంకు అధికారులు సైతం ఎక్కడ రుణాల మంజూరులో భౌతిక పరిశీలన చేయకుండా చెరువుపై కోట్ల రూపాయల రుణాలు అందించిన ఘటనలో బ్యాంకు అధికారులు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది.

 

.. రాజ్‌భవన్‌కు నాడెం చెరువు పంచాయతీ

నాడెం చెరువు కబ్జా అక్రమంగా బ్యాంకులలో 40 కోట్ల రుణాలు మంజూర్‌ అవ్వడంతో పాటు మంజూరైన రుణాలను రుణ గ్రహితలు తిరిగి చెల్లించకపోవడంతో చెరువును వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు నోటీసులు సైతం జారీ చేశారు. దీంతో గ్రామంలో చెరువును నమ్ముకుని జీవిస్తున్న 106 ముదిరాజ్‌ కుటుంబాలు తమ జీవనోపాధి అయిన చెరువును వేలం వేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు చెరువు రుణాల మంజూరుపై ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించడమే కాకుండా ఈ పంచాయతీని గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్ళేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో వ్యక్తి సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణగా ఏర్పాటైన తర్వాత మొదటగా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం చెరువుల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది కానీ ప్రస్తుత పరీస్థితి చెరువును వేలంవేసే వరకు వచ్చిందంటే ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో? ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది అనేది వేచి చూడాలి.

 

Leave A Reply

Your email address will not be published.