ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో నేడు నిర్వహించిన ప్రజాదర్బార్ కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను రాష్ట్ర ఐ టి , పరిశ్రమలు ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిషరిస్తుందని తెలిపారు. పెద్దలు, వివిధ వర్గాలతో నెల రోజుల పాటు ప్రజా సమస్యలను కూలంకషంగా చర్చించి మానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి , పరిస్కరించుటకు వీలవుతుందని తెలిపారు. ఈ నెల 17 న నిర్వహించనున్న TS Genco AE పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు వున్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికితీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు .సంబంధిత అధికారులతో చర్చించి TS Genco AE Exam వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారు. అన్ని సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.