రూ.18 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి సంవత్సరాలలో జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధకమత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధిసినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేటసనత్ నగర్ డివిజన్ లలో 2.18 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా అమీర్ పేట డివిజన్ లోని సోనాబాయి టెంపుల్ వద్ద 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు నిర్మాణ పనులనుబల్కంపేట రోడ్డులోని బృందావన్ హోటల్ సమీపంలో 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులనుసనత్ నగర్ డివిజన్ లోని టైప్ కాలనీలో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివేకానంద కమిటీ హాల్ నిర్మాణంచిల్డ్రన్స్ పార్క్ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రవీంద్రనగర్ కమిటీ హాల్  మొదటి అంతస్తు ను ప్రారంభించారు. అదేవిధంగా అల్లా ఉద్దిన్ కోటి లో 13.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. సోనాబాయి టెంపుల్ వద్ద గల హరిజన బస్తీలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించి బస్తీ వాసుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందనిపరిష్కరించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం త్వరితగతిన నూతన పైప్ లైన్రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని EE ఇందిరావాటర్ వర్క్స్ GM హరి శంకర్ లను మంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.