ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు మరోసారి విచారణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలు లో ఉన్న విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన కేసులో బుచ్చిబాబు జైలులో ఉన్నారు. ఆయనను రెండు రోజుల పాటు విచారించేందుకు ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు. ఈడీ విజప్తిపై స్పందించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ అనుమతించారు.దీంతో గురువారం నుంచి రెండు రోజుల పాటు తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి కీలక విషయాలు బుచ్చిబాబు నుంచి సేకరించాల్సివుందని ఈడీ అధికారులు అంటున్నారు. గతంలోను పలుమార్లు తమ కార్యాలయానికి పిలిపించి బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం. బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన సీబీఐ.. ఆయనను అరెస్టు చేశారు. గతంలో కూడా సీబీఐఈడీ బుచ్చిబాబును పలుమార్లు ప్రశ్నించాయి.

Leave A Reply

Your email address will not be published.