మితమైన మద్యపానం గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు మంచిది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆల్కహాల్ వినియోగం అనేది వాహన ప్రమాదాలు, హింస, లైంగిక ప్రమాద ప్రవర్తనలు, అధిక రక్తపోటు, వివిధ క్యాన్సర్‌లు వంటి అనేక రకాల స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. అంతే కాకుండా 10,000 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా పులియబెట్టిన మద్యాన్ని తాగుతున్నారు, దీనివల్ల కూడా ప్రమాదమేనట, మద్యపానం మంచిదా, చెడ్డదా అనేదానిపై చర్చ జరుగుతూనే ఉంది.మితమైన మద్యపానం గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు మంచిది. టైప్ 2 డయాబెటిస్, పిత్తాశయ రాళ్ల నుండి రక్షిస్తుంది. అధిక మద్యపానం చాలా దేశాల్లో మరణాలకు ప్రధాన కారణం. U.S.లో, ప్రాణాంతకమైన ట్రాఫిక్ ప్రమాదాలలో దాదాపు సగం మద్యం సేవించడం వల్లనే జరుగుతున్నాయి. అధికంగా మద్యపానం కాలేయం, గుండెను దెబ్బతీస్తుంది. గర్భవతులు తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుంది. అంతేకాదు రొమ్ము, క్యాన్సర్ లను పెంచే ప్రమాదాన్ని పెంచుతుంది. నిరాశ, హింసకు కారణం అవుతుంది.

ఆల్కహాల్ లో క్రియాశీల పదార్ధం, ఇథనాల్ శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది నేరుగా కడుపు, మెదడు, గుండె, పిత్తాశయం, కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది రక్తంలో లిపిడ్లు ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది, అలాగే మానసిక స్థితి, ఏకాగ్రత, సమన్వయాన్ని కూడా మారుస్తుంది.రోజూ త్రాగే ఆల్కహాల్ పరిమాణంతోనే ఈ హాని ప్రమాదం పెరుగుతుంది. కొన్ని పరిస్థితులలో, కొన్ని క్యాన్సర్ల మాదిరిగా, చాలా తక్కువ స్థాయిలో ఆల్కహాల్ వినియోగం ఉన్నా కూడా ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ సంబంధిత హాని ప్రమాదాన్ని తగ్గించడానికి, అమెరికన్ అధ్యయనం ప్రకారం ఒక వయసు పురుషులు రోజుకు 2 లేదా అంతకంటే తక్కువ పెగ్స్ తీసుకుని మితంగా తాగాలని సూచించింది.అస్సలు తాగకూడని వ్యక్తులుకొంతమంది వ్యక్తులు మద్యం సేవించకూడదని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి, అవి:

  1. గర్భవతులు మద్యానికి దూరంగా ఉండాలి.
  2. 21సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే.. వారు కూడా మద్యం సేవించకూడదు.
  3. కొన్ని వైద్య పరిస్థితులను కలిగి ఉన్నా,చిక్సిత్సలో భాగంగా మందులు తీసుకునేవారు కూడా దూరంగా ఉండాలి.
  4. పాలిచ్చే మహిళలు ఆల్కహాల్ తాగకపోవడం మంచిది.
Leave A Reply

Your email address will not be published.