తెలంగాణాలో మోడీ ఆటలు ఇక సాగవు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బిర్కూర్ ప్రతినిది: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, మోడీ కేడి ఆటలు సాగవని తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తెలిపారు. తెరాస పార్టీ కి చెందిన నలుగురు ఏంమ్మెల్యే లను కొనుగోలు చేయటానికి బేరసారాలు చేసిన బీజేపీ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం రోజు మండల కేంద్రం బీర్కూర్ లో ధర్నా కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనను అస్థిరపర్చటానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మ్మెల్యే లను కొనుగోలు చేయడానికి బీజేపీ కి సిగ్గుండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తమ నాయకులు నీఖరసైనా సైనికులని తెలిపారు. బీజేపీ హటావో, దేశ్కు బచావో, బీజేపీ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేసారు. అనంతరం బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజి జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం, కో ఆప్షన్ ఆరీఫ్, గ్రామ పార్టీ కార్యదర్శి కోరిమె రఘు,మండల సర్పంచ్లు కృష్ణారెడ్డి, అంబయ్య, రాంబాబు, నాయకులు పడితే నారాయణ, సత్యనారాయణ, గంగొండ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.