రెండు రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజాను దాటిన  లక్షా 20 వేలకు పైగా వాహనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షా 20 వేలకు పైగా వాహనాలు టోల్‌గేట్‌ దాటాయి. గురు, శుక్రవారాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంటల వరకు పంతంగి, బీబీనరగ్‌ టోల్‌ప్లాజా మీదుగా పయణించిన వాహనాల సంఖ్యను రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు విడుదల చేశారు.హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ నెల 12న మొత్తం 56,595 వాహనాలు పాస్‌అయ్యాయి. ఇందులో 42,844 కార్లు ఉండగా 1,300 ఆర్టీసీ బస్సులు, 4,913 ప్రైవేట్ బస్సులు, 7,538 గూడ్స్, ఇతర వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇక శుక్రవారం రాత్రి (13/01/2023) మొత్తం 67,577 వాహనాలు టోల్‌ప్లాజా మీదుగా పయణించాయని చెప్పారు. ఇందులో 53,561 కార్లు, 1,851 ఆర్టీసీ బస్సులు, 4,906 ప్రైవేట్ బస్సులు, 7,259 ఇతర వాహనాలు ఉన్నాయి.కాగా, హైదరాబాద్-వరంగల్ హైవేపై ఉన్న బీబీనగర్ టోల్‌గేట్ మీదుగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 1 గంటవరకు మొత్తం 25231 వాహనాలు పయణించాయని తెలిపారు. ఇందులో 17844 కార్లు, 872 బస్సులు, వరంగల్ వైపు నుంచి హైదరాబాద్‌కు మొత్తం 13,334 వాహనాలు వెళ్లాయని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.