24 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడుత కౌన్సెలింగ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడుత కౌన్సెలింగ్‌ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి విడుత కౌన్సెలింగ్‌ పూర్తికాగాఈ నెల 16న సీట్లను కేటాయించారు. మొద‌టి విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థుల‌కు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 23వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు.దీంతో ఈ నెల 24 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభించనున్నారు. విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌లో తమ సమాచారాన్ని పొందుపరిచిప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించిస్లాట్ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈనెల 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. 24 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 27న సీట్లను ఫ్రీజ్‌ చేయనుండగాఈ నెల 31న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేయడంతో పాటుట్యూషన ఫీజు చెల్లించవచ్చు.మొదటి విడుత కౌన్సెలింగ్‌లో మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 82,666 సీట్లుండగామొదటి విడుతలోనే 70,665 సీట్లు కేటాయించారు. మరో 12,001 సీట్లు మిగిలి ఉండగావీటిని రెండో విడుత కౌన్సిలింగ్‌లో భర్తీచేస్తారు. అంతేకాకుండా మొదటి విడుతలో సీట్లు పొందిన వారు ట్యూషన్‌ ఫీజు చెల్లించని పక్షంలో ఆయా సీట్లు రద్ద‌యినట్లుగా భావించివాటిని రెండో విడుత కౌన్సెలింగ్‌కు బదిలీ చేస్తారు. దీంతో రెండో విడుతలో కేటాయించే సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి

Leave A Reply

Your email address will not be published.