ముదిరాజ్ లను  బీసీ డి  నుండి ఏ గ్రూపులోకి మార్చాలి

- జనాభా తమాషా  ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించలి  - తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మాణం  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్ లోని బీసీ భవన్ లో జరిగింది.ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం  ముదిరాజ్ కార్పొరేషన్ఏర్పాటు చేయడం మరియు ముదిరాజ్ లను  బీసీ డి  నుండి ఏ గ్రూపులోకి మార్చడం అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా తమాషా  ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించడం మొదలగు వాటి  పైన విస్తృతంగా చర్చించడం జరిగింది. జేఏసీ నుండి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ముదిరాజులకు అత్యధిక స్థానాలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బీసీ డీ నుండి ఏ గ్రూపులోకి మార్చాలని ప్రభుత్వం పైన ఒత్తిడి  తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది జేఏసీని జిల్లా స్థాయి నుండి పటిష్టంగా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది ముదిరాజ్  జెసి వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో జగన్ ముదిరాజు , సుధాకర్ ముదిరాజు , గుండు నరసింహ ముదిరాజు, లక్ష్మణ్ ముదిరాజు, నీరజ ముదిరాజు , గౌరీ శంకర్ ముదిరాజ్, హరి ముదిరాజ్, బాలు ముదిరాజ్, కృష్ణ మనోహర్ ముదిరాజ్, సదానంద ముదిరాజ్, తుపాకుల బాల్ లింగం ముదిరాజ్, కనకమ్మ ముదిరాజు, మాధవి ముదిరాజ్ , కిషన్ ముదిరాజు ,శ్రీనివాస్ ముదిరాజు, ప్రశాంత్ ముదిరాజ్ , నిరంజన్ ముదిరాజ్, కృష్ణ మనోహర్ ముదిరాజ్ , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.