పథకం ప్రకారం దంపతుల హత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన  జింక లచ్చన్న, రాజేశ్వరి దంపతులను అదే గ్రామానికి చెందిన గూడ సతీష్ రోకలి బండతో బాది హత మార్చాడు. హత్యానంతరం నిందితుడు మృతుల ఇంటి పక్కనే ఉంటాడు. మృతుడు లచ్చన్న కూతురు లక్ష్మి నిందితుడి కొడుకు రాజుకి పరిచయం ఉంది. రాజు ద్వారా అతని స్నేహితుడు షోయబ్ కూడా పరిచయం అయ్యాడు. కాగా స్నేహితుడు కావడంతో 2020 సంవత్సరంలో లక్ష్మి, షోయబ్  కు కొంత నగదు, బంగారం ఇచ్చింది. తర్వాత వారిద్దరికి స్నేహం చెడిపోవడంతో అప్పటి నుండి లక్ష్మి, షోయబ్ ను ఎన్నిసార్లు డబ్బులు బంగారం గురించి అడిగిన ఇవ్వకపోవడంతో రాజు వలన షోయబ్ పరిచమయ్యాడని ఆ డబ్బులు బంగారం రాజు ఇవ్వాలని తరచు లక్ష్మి తండ్రి జింక లచ్చన్న, ఆమె తల్లి జింక రాజేశ్వరి తరచూ రాజు ఇంటికి వస్తూ గొడవ చేస్తూ తిడుతూ ఉండే వారు. దీంతో వారిని చంపితే తప్ప సమస్య పరిష్కారం కాదని రాజు తండ్రి నిర్ణయించుకున్నారు. తన కొడుకు రాజుని బతుకు దెరువు కోసం ఇరాక్ పంపించారు. తన కొడుకు రాజు ఇరాక్ వెళ్లిన తర్వాత కూడా ప్రతిరోజు జింక లచ్చన్న, జింక రాజేశ్వర్లు  డబ్బులు బంగారం గురించి అడుగుతూ బూతులు తిడితూ ఇబ్బంది పెట్టే వారు. వారి ఇబ్బంది తప్పాలంటే వారిని ఏలాగైనా చంపాలని నిర్ణయించుకొని నిందితుడు సతీష్, భార్య భూలక్ష్మి, అక్క మల్లవ్వ, అమ్మ లక్ష్మి, ఇంకా వరుసకు అన్న అయిన గూడ లచ్చన్న అదును  కోసం ఎదురు చూశారు. రెండు రోజుల క్రితం వారి వాడలో కూరగాయల కోసం జన్నారం వెళ్లారు. ఈ క్రమంలో వారితో గొడవపడి పథకం ప్రకారం ఇంటిలో సిద్ధంగా ఉన్న మంచం పట్టిని తీసుకుని వచ్చి ముందుగా జింక లచ్చన్న తలపై బలంగా కొట్టగా అతను కింద పడిపోయాడు. అడ్డు వచ్చిన జింక రాజేశ్వరిని కూడా అదే మంచం పట్టితో తల మీద గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాక చనిపోయారని నిర్ధారించుకొని నిందితులు ఐదుగురు అక్కడి నుండి పారిపోతూ..వారిని చంపడానికి ఉపయోగించిన మంచం పట్టిని, వారిని చంపేటప్పుడు వేసుకున్న బట్టలను నిందితులు బాదంపల్లి గ్రామానికి వెళ్లేరోడ్డు పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ వెనకాల  పొదల్లో దాచిపెట్టి పారిపోయారు. అయితే మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జన్నారం పోలీసులు విచారణ చేపట్టి, సిసి ఫుటేజి ఆధారంగా హత్యకు పాల్పడిన నిందితుడు సతీష్ తో పాటు అతనికి సహకరించిన నిందితులు భూలక్ష్మీ, లక్ష్మీ, లచ్చన్న, మల్లవ్వ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జన్నారం బస్టాండ్ వెనుక ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కరీముల్లా ఖాన్ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.