నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌ నగరంలోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. నాగోల్‌లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను నిర్మించామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు.వచ్చే ఏడాది మార్చి నెలలోపల మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నాగోల్ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ మీద ఆరు లైన్లలో వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్‌ దగ్గర అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ఇప్పుడు నాగోల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకుఅక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సులభతరం కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.