ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రదాని నరేంద్ర మోదీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.యుఎస్‌కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో.. భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 18 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఇక మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రేడర్‌ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికో ప్రజలు 66 శాతం మంది ఆమోదిస్తుండగా.. 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఆండ్రెస్‌ తర్వాత స్విట్జర్లాండ్‌ ప్రెసిడెంట్‌ అలైన్‌ బెర్సెట్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వాన్ని 58 శాతం ప్రజలు కోరుకుంటుండగా.. 28 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.ఈ సర్వేలో బ్రెజిల్‌కు చెందిన లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇటలీ మాజీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ సర్వేలో ఆరో స్థానంలో నిలిచారు. 41 శాతం మంది ఇటలీ వాసులు ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ డి క్రూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇద్దరూ 37 శాతం ప్రజామోదంతో 7, 8 స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కేవలం 24 శాతం మాత్రమే ఆమోదం లభించింది.

Leave A Reply

Your email address will not be published.