మునుగోడుకు తరలిన నసరులాబాద్ టిఆర్ఎస్ నాయకులు

... నేటి నుంచి ఎన్నికల కదన రంగంలోకి , ... గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహులు

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్ నసురుల్లాబాద్: మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టిఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ప్రజల ఆశీర్వాదం దండిగా ఉన్న అధికార పార్టీ ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదన్నది, బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టిఆర్ఎస్ మునుగోడులో సత్తా చాటేఎందుకు సన్నదిద్దమవుతున్నది, ఉపఫోర్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించింది, ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల ప్రచార బాధాతలను ఉమ్మడి జిల్లా నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల నాయకులకు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను అప్పగించారు, అనంతరం నసురుల్లాబాద్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు పెర్కశ్రీనివాస్ మాట్లాడుతూ. భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిసిస్తున్నది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు మెజార్టీ స్థానాల్లో ప్రజల విశ్వాసాన్ని పొందిన గులాబీ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీ స్థాయిలో మద్దతు దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు, ఇదే ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది, హుజూర్ నగర్ ఉప ఎన్నిక స్ఫూర్తితో మునుగోడు నియోజకవర్గంలోనూ గెలుపు బావుట ఎగరేసేందుకు (బీఆర్ఎస్) సిద్ధమైంది ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్ రెడ్డి నాయకులు బాధ్యతలు అప్పగించడంతో, నసురుల్లాబాద్ మండల్ తెరాస పార్టీ అధ్యక్షులు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వెంకటరమణ, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీటీసీ సభ్యులు కంది మల్లేష్, ప్రతాప్ సింగ్, మునుగోడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన మండల నాయకులు, మరియు ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.