జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వినర్ బిల్లా దీపిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వినర్ గా  బిల్లా దీపిక నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బిల్లా దీపికకు నియామక పత్రాన్ని  అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన పోరాటంలో మహిళల పాత్ర కూడా కీలకమైంది అన్నారు. పార్లమెంట్లో బిసిబిల్లు పెట్టాలని, బిసి జనగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అనంతరం బిల్లా దీపిక మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం ముఖ్యంగా బీసీ మహిళల సమస్యలపై తన వంతు పోరాటం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొర్రె మల్లేష్ యాదవ్, బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సి. రాజేందర్,బిసి ఐక్యవేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య,  బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజకుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంటి ముదిరాజ్ లకు దీపిక అభినందన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.