నీరా కేఫ్ లను గీత కార్మికులకే కేటాయించాలి

తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు గడ్డమీది అనురాధ గౌడ్ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం 16 కోట్లతో నిర్మించి, ప్రారంభించిన నాలుగు నెలలకే కేఫ్ నష్టాలు వస్తున్నాయన్న సాకుతో 15నెలలేక్  ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం ప్రారంభమైందని తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు గడ్డమీది అనురాధ గౌడ్ పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్వహించలేని పక్షం లో వాటిని గీత సొసైటీలు, గీత కార్మికులకు సబ్సిడీతో నీరా కేఫ్ కేటాయించాలని ఆమె డిమాండ్ చేసారు.అంతే కాకుండా నీరా కేఫ్ లను బడా పారిశ్రామికవేత్తలకు కాకుండా గీత కార్మికులకు ఇవ్వాలన్నారు. రిజిస్టర్ అయిన సొసైటీలకు 6 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి కేటాయిస్తామని ప్రకటన ఇచ్చారని పేద గీత కార్మికులు 6 లక్షలు పెట్టి కేఫ్ లను నడపలేరని అన్నారు. ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా గీత కార్మికులకు, సొసైటీలకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షం లో  పక్షంలో 33 జిల్లాల వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నట్టు అనురాధ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరుపేద గీత కార్మికులు, గౌడ కులస్తులను నీరా కేఫ్ లు కేటాయించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.