ఆన్ లైన్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ సేవ‌లు

- వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: హైదారాబాద్ కు త‌ల‌మానికంగా ఉన్న నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్, మొబైల్ యాప్ ను రూపొందించినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వెబ్ సైట్ లో స‌మ‌స్త సమాచారాన్ని నిక్షిప్తం చేయ‌డంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. సోమవారం అరణ్య భవన్ లో నెహ్రూ జూ పార్క్, కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్ సైట్ (https://nzptsfd.telangana.gov.in/home.do) ను రూపొందించింది.ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, పీసీసీఎఫ్ (ఎఫ్ ఏసీ) ఎం.సీ. పర్గయిన్, జూ పార్క్ డైరెక్టర్ వినయ్ కుమార్, క్యురేటర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.