వరుస భూకంపాలతో దద్ధరిల్లిన నేపాల్‌

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్; పొరుగున ఉన్న నేపాల్‌ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. ముందుగా మధ్యాహ్నం 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.ఆ తర్వాత 2.51 గంటలకు 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌తోపాటు ఉత్తర భారతదేశం కూడా కంపించింది. ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌తోపాటు ఉత్తరాఖండ్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.ఆ తర్వాత 3.06 గంటలకు 3.6 తీవ్రతతో మరో భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఆ వెంటనే 3.19 గంటలకు 3.1 తీవ్రతతో నాలుగో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలో మీటర్ల లోతులో నమోదైంది. ఇలా మొత్తం నాలుగుసార్లు భూమి కంపించింది.

Leave A Reply

Your email address will not be published.