ఏపీలో నెక్ట్స్ స్టెప్ కుల రాజకీయాలు

.. డిసెంబర్ 8న బీసీల కేంద్రంగా సీఎం జగన్ భారీ బహిరంగ సభ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో కుల రాజకీయాలు కొత్తకాదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ కులాలకు ప్రాధాన్యం.. రాజకీయంగా వాటికి గుర్తింపుకూడా పెరిగిపోయింది.  రెడ్డి సామాజిక వర్గం అంటే వైసీపీ కమ్మ వర్గం అంటే టీడీపీ కాపులు అంటే జనసేన. అన్నట్టుగా కొన్నాళ్లుగా ప్రచారం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో నాయకులు  చేస్తున్న ప్రకటనలు కూడా అలానే ఉన్నాయి. అధికార పార్టీ కేవలం.. రెడ్డి వర్గానికే ప్రాధాన్యం ఇస్తోందనేటాక్ ఉంది.ఈ నేపథ్యంలో దీని నుంచి బయటపడేందుకు బీసీ వర్గాలకు చేరువ అయ్యేందుకు పార్టీ అధినేత సీఎం జగన్..  వచ్చే నెల 8న బీసీల కేంద్రంగా భారీ బహిరంగ సభకు రెడీ అయ్యారు. దీనిలో బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలనే నిర్ణయానికి ఆయన మొగ్గు చూపనున్నారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. వచ్చే ఎన్నికల్లో బీసీలను తనవైపు తిప్పుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల్లోనూ చర్చసాగుతోంది.వాస్తవానికి సీఎం జగన్ వివిధ బీసీ వర్గాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా.. వాటికి కేవ లం చైర్మన్ పదవులు మాత్రమే కేటాయించారు తప్ప నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల్లో ఆయా వర్గాలకు మేలు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. సో.. ఇది పార్టీకి మేలు చేసే పరిస్థితి లేదని గుర్తించిన జగన్.. ఇప్పుడు బీసీలతో భేటీకి రెడీ అవుతున్నారు. దీంతో ఇతర పార్టీలు కూడా కుల సమీకరణల దిశగా అడుగులు వేస్తున్నాయి.ఇప్పటికే జనసేన అధినేత పవన్.. తూర్పు కాపులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కీలకమైన కాపు వర్గాన్ని వదులుకోకుండా.. ఇతర వర్గాల వారు దూరం కాకుండా పవన్ జగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు కూడా కులాల వారిగా సమావేశాలు నిర్వహించాలని అనుకున్నా.. జిల్లాల పర్యటనల్లో వాటిని నిర్వహించాలని భావిస్తున్నారు.సో.. మొత్తానికి ఏపీలో ఈ కుల పాలిటిక్స్ ఎవరికి మేలు చేస్తాయో లేక ఎవరికివారే ప్రయోజనం పొందుతారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.