నిజామాబాద్ ఎంపీ నోటి దురుసునే దాడికి కారణం:ఎంపీ రవిచంద్ర

.. అర్వింద్ ఇంటిపై దాడి విషయంలో కులాల ప్రస్తావన తేవడం తీవ్ర అభ్యంతరకరం .. కొనసాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై చోటుచేసుకున్న దాడి విషయంలో కులాల ప్రస్తావన తేవడం,కులాలకు ఆపాదించడం తీవ్ర అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎంపీగా గెలిచిన నాటి నుంచి అర్వింద్ టీఆర్ఎస్ ప్రముఖులపై నోరు పారేసుకోవడం, పోలీసులు, ప్రభుత్వ అధికారులతో తరుచూ గొడవ పడడం అందరికీ తెలిసిందేనన్నారు.అర్వింద్ అతిగా మాట్లాడడం వల్లే ఎమ్మెల్సీ కవిత అభిమానులు ఆయనపై ఇంటిపై దాడి చేసి ఉంటారని శనివారం సాయంత్రం ఖమ్మంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండి,అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగడాన్ని బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆవేదన చెందారు.బీజేపీ పాలిత రాష్ట్రాలు అనిశ్చిత వాతావరణంలో అభివృద్ధి కి దూరంగా ఉండడం,అందుకు భిన్నంగా తెలంగాణలో పచ్చదనం నెలకొనడంతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతుండడం శోచనీయం అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మున్నూరుకాపులకు పలు పదవులిచ్ఛి సముచిత గౌరవం ఇవ్వడం జరిగిందని వద్దిరాజు వివరించారు.రాజకీయ గొడవలను కులాలకు ఆపాదించవద్దని ప్రతిపక్ష నాయకులకు రవిచంద్ర హితవు పలికారు.విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు,ఆకుల గాంధీ,జాబిశెట్టి శ్రీనివాస్ రావు,తీగల విజయ్,గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.