ఎంతో మంది ఎన్ని సార్లు చెప్పినా అరవింద్ తీరు మార్చుకోలేదు

...బీజేపీ ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవితమ్మ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధిస్తున్నా.. ...అరవింద్ వ్యవహరిస్తున్న తీరుకు కవితమ్మ తిట్టిన తిట్లు తక్కువే .. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంతో మంది ఎన్ని సార్లు చెప్పినా అరవింద్ తీరు మార్చుకోలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ బిగాల,ఎమ్మెల్సీ లు వి. గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ రావు లు అన్నారు. శనివారం టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవితమ్మ చేసిన వ్యాఖ్యలను తానూ పూర్తిగా సమర్ధిస్తున్నానని, అరవింద్ వ్యవహరిస్తున్న తీరుకు కవితమ్మ తిట్టిన తిట్లు తక్కువే అన్నారు. రాజకీయాల్లో సంస్కార హీనుడు అరవింద్, కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని అరవింద్ నీచాతి నీచంగా మాట్లాడాడు అరవింద్ రాజకీయాలకే ఓ కళంకం కవితమ్మ చెప్పు తో కొడతా అన్నది ముమ్మాటికీ కరెక్టు అన్నారు. నిజామాబాద్ కు ఎంపీ గా అరవింద్ చేసింది శూన్యం పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పిన వాడు అరవింద్ ను గ్రామాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది కనుకే అరవింద్ వార్తల్లో ఉండేందుకు సంచలన ప్రకటనలు చేస్తున్నాడు. ktr, కవిత కష్ట కాలం లో ఉద్యమం లో ఉన్నారు. అమెరికా లో మంచి ఉద్యోగాలను వదిలి ఉద్యమం లో పాలు పంచుకున్నారు. వారు కేసీఆర్ ను వదిలి ఎక్కడికి వెళుతారు అని ప్రశ్నించారు. అరవింద్ తీరు పిచ్చి కుక్కలా ఉంది కవిత ఖర్గే తో మాట్లాడింది నువ్ చూశావా అరవింద్ ఎదో ఒక్కటి కెలుక్కుని తెలంగాణ లో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్ర పన్నింది అని తెలిపారు. కేసీఆర్ ను కవితను అనరాని మాటలు అంటే అభిమానులు ఊరుకుంటారా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ డ్రామాలు సర్కస్ లు చేస్తోంది ప్రత్యర్థి రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ కి కొత్త కాదు
శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, హేమంత్ సొరేన్, రామ్ విలాస్ పాశ్వాన్ ,కృష్ణ పటేల్ కుటుంబాల్లో చిచ్చు పెట్టిన పార్టీ బీజేపీ
ఇది బీజేపీ డగుల్భాజీ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. తల్లికి బిడ్డకు అన్నకు తమ్ముడికి కొట్లాట పెట్టి ప్రభుత్వాలను కూల గొడుతున్న పార్టీ బీజేపీ
కవితమ్మ అన్న దాంట్లో తప్పేమి ఉంది కవిత ఇంటి పై దాడి జరిగినపుడు గవర్నర్ ,కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎక్కడ ఉన్నారు కేసీఆర్ బిడ్డను అమ్ముకుంటున్నాడు అని అరవింద్ ఆరోపణలు చేసినపుడు మహిళ ఆయిన గవర్నర్ ఏమి చేస్తున్నారన్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే రాజకీయాల స్థాయి దిగజారింది
తిట్లు టిడితేనే వార్తకు ప్రాముఖ్యత వస్తుండటం దురదృష్టకరం కేసీఆర్ ను బండి సంజయ్ ఫెయిల్యూర్ సీఎం అంటున్నారు సక్సెస్ అంటే ఏమిటి ఫెయిల్యూర్ అంటే ఏమిటో బండి సంజయ్ కు తెలుసా అన్నారు. అభివృద్ధి ఏ సూచికలు తీసుకున్నా జాతీయ స్థాయి కన్నా తెలంగాణ ముందుందని బండి సంజయ్ కు తెలియదా
పీఎం మోడీ ఓ ఫెయిల్యూర్ ప్రధాన మంత్రి కేసీఆర్ ఏ అంశాల్లో సఫలం అయ్యారో అవే అంశాల్లో మోడీ విఫలం అయ్యారు. జీడీపీ, జాతీయ తలసరి ఆదాయం లో మోడీ దేశాన్ని దిగజార్చారు. రూపాయి విలువను మోడీ దిగజార్చారు. ఎపుడు ఎన్నికలు వస్తాయో ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ అంటున్నారు మునుగోడు లో ఓటమి పాలయినా బీజేపీ బుద్ది మారడం లేదని ఎద్దేవా చేసారు. అరవింద్ తన తీరు మార్చుకోక పోతే ప్రజలు నిజామాబాద్ లో ఉరికించి ఉరికించి కొడతారు. అరవింద్ ఇంట్లో మూడు పార్టీ ల వ్యక్తులు ఉన్నారు. .కాంగ్రెస్ తో కుమ్మక్కయి నందు వల్లే అరవింద్ ఎంపీ గా గెలిచారు అను కోకుండా అరవింద్ ఎంపీ గా గెలిచారు అరవింద్ భాష పై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలన్నారు.

…ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ 
అరవింద్ భాష శ్రుతి మించి పోయింది, కేసీఆర్ ను కవిత ను వ్యక్తిగతంగా తిడితే అభిమానులు ఎంత కాలం ఓపిక పడతారు సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుంది
బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే ఈ దాడి చాలా చాలా చిన్నది, చిన్న ఘటన పై బీజేపీ రాద్ధాంతం చేస్తోంది మాకు కూడా బూతులు వస్తాయి. జాగ్రత్త అరవింద్ ఇంటి పైనే ఎందుకు దాడి జరిగింది ఇతర బీజేపీ నేతల ఇంటి పై ఎందుకు దాడి జరగలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ ,అరవింద్ ల భాష తర్వాతే రాజకీయాలు దిగజారాయి ఇకనైనా బీజేపీ నేతల తీరు మార్చుకోవాలి.

..ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్
తెలంగాణ లో బీజేపీ హింసా రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోంది, బెంగాల్ ఫార్ములా ను తెలంగాణ లో అమలు చేసే కుట్ర బీజేపీ ది
బెంగాల్లో విఫలమైనట్టే బీజేపీ తెలంగాణ లో విఫలం కాక తప్పదన్నారు. కవిత ఎంపీ గా నిజామాబాద్ ను అభివృద్ధి చేశారు.. అరవింద్ కు తిట్ల దండకం తప్ప మరొకటి చేతకాదు, ఎపుడు ఎన్నికలు జరిగినా అరవింద్ చిత్తు చిత్తుగా ఓడి పోతారు. ఎంపీ గా ఓడిపోవడం ఖాయమని తెలిసే ఇపుడు అరవింద్ ఆర్మూర్ లో మకాం వేశారన్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేసినా అరవింద్ కు జీవన్ రెడ్డి చేతి లో ఓటమి తప్పదు, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితం లో అరవింద్ తరహా భాషను చూడలేదని పేర్కొన్నారు.
ఆడబిడ్డగా కవిత ఎంత ఆవేదనకు లోనైతే అలా మాట్లాడతారు, కవిత పై అరవింద్ వాడిన భాషను ఖండిస్తున్నాం అన్నారు.

.. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు
అరవింద్ మొదట్నుంచీ తప్పుడు మార్గం లో ఉన్నారు, పెరగడమే తప్పుడు పద్ధతుల్లో పెరిగారు తప్పులు చేయడం అరవింద్ కు పరిపాటి గా మారింది. కాంగ్రెస్ లో ఉన్నపుడు బీ ఫారం లు అమ్ముకున్న వ్యక్తి అరవింద్ అన్నారు. ఓ ఆడబిడ్డ ,కేసీఆర్ కూతురు పై ఏది పడితే అది మాట్లాడొచ్చా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అన్ని వర్గాలు సుఖ శాంతులతో ఉన్నది కేసీఆర్ పాలనలోనే అరవింద్ మరోసారి నిజామాబాద్ లో ఓడి పోవడం ఖాయం అని జ్యోస్యం చెప్పారు. అరవింద్  కు ప్రజలే బట్టలు విప్పి హైద్రాబాద్ కు పంపిస్తారు, బీజేపీ నేతలు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.