మా నాన్న ఏ పార్టీలో చేరినా.. నాకు రాజకీయంగా నష్టం లేదు

- ఆయనకు మానసిక ప్రశాంతత కావాలి - సోనియాగాంధీ కుటుంబానికి 40, 45 ఏళ్లు సేవచేశారు. - కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోలేదు. - స్వయంగా ఇంటికొచ్చి పార్టీలో చేర్చుకుంటే బావుండేది. - 2015లో కాంగ్రెస్ వాళ్ళే డీఎస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టుకున్నారు.. - నిన్నటి ఎపిసోడ్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వివరణ

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మ నాన్న ఎపిసోడ్ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాను. గాంధీ భవన్‌కు వెళ్లి వచ్చారని మాత్రం నాకు తెలుసు. మా నాన్నగారికి ఆదివారం రాత్రి ఫిట్స్ వచ్చిన మాట వాస్తవం. ఇందుకు సంబంధించి వీడియో కూడా నా దగ్గర ఉంది. డాక్టర్స్‌కు ఆ వీడియో పంపితే.. వారు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలనేదానిపై మాకు సూచనలు చేస్తారు. ఇందులో నాకెలాంటి సంబంధం లేనే లేదు. మా నాన్నే కాంగ్రెస్ వ్యక్తే.. గత ఐదేళ్ల నుంచి నేను వందల సార్లు ఈ విషయం చెప్పాను. మా నాన్న కట్టర్ కాంగ్రెస్.. నేను కట్టర్ బీజేపీ వాడినే. ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ వాదే. నిన్న ఫిట్స్‌ వచ్చాక మా అమ్మ ఇబ్బంది పడి ఉంటుంది. రెండో విషయం నాకు నచ్చనిది.. అమ్మకు కూడా నచ్చనిది ఒకటుంది. డీఎస్ లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు.. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.. హైపర్ టెన్షన్ ఉంది.. డైలీ ఫిట్స్ వస్తున్నాయి. పెరాలిసిస్ కూడా ఉంది. ఆయన బాత్రూమ్‌కు కూడా సరిగ్గా పోలేని వ్యక్తిని.. గాంధీ భవన్‌కు తీసుకెళ్లి ఆయనెవరో మాణిక్‌రావ్ ఠాక్రే అంట కండువా కప్పారు. కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకునేకి ఇది సరైన సమయం కాదు.. ఆయన 2018 నుంచి పార్టీలో చేరతానంటే.. మీరు తీసుకోలేదు.. ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. సోనియాగాంధీ కుటుంబానికి 40, 45 ఏళ్లు సేవచేశారు. కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోలేదు. స్వయంగా ఇంటికొచ్చి పార్టీలో చేర్చుకుంటే బావుండేది. 2015లో కాంగ్రెస్ వాళ్ళే డీఎస్ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టుకున్నారు. మా నాన్న ఏ పార్టీలో చేరినా.. నాకు రాజకీయంగా నష్టం లేదు. కాంగ్రెస్‌లో చేరినా కమ్యూనిస్టు పార్టీలో చేరినా నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమయంలో ఆయన్ను పార్టీలో చేర్చుకుని మానసికంగాశారీరకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అని ధర్మపురి అర్వింద్ వీడియో రిలీజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.