దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు

: శరద్‌ పవార్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పేరు మార్పుపై ఇప్పటికే పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాగాఈ అంశంపై రాజకీయ కురువృద్ధుడునేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తాజాగా స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న పవార్‌ను రాజ్యాంగంలో భారతదేశం పేరు మార్చబడుతుందా..?’ అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ బదులిచ్చారు. దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు అంత కలవరపడుతోందో నాకు అర్థం కావడం లేదు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరు’ అని అన్నారు. భారత కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశం బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోందని తెలిపారు. ఈ సమావేశంలో దేశం పేరు మార్పుపై చర్చ ఉంటుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాద‌న‌ను స‌భ్యుల ముందుంచ‌నుంద‌ని తెలుస్తోంది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌ గా మార్చే ప్రక్రియ‌ను కేంద్ర ప్రభుత్వం చేప‌డుతోందని.. ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ స‌ర్కార్ పావులు క‌దుపుతోంద‌ని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ నుంచి జీ20 ప్రతినిధుల‌కు అధికారిక స‌మాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిఉండ‌టం పేరు మార్పు ప్రతిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ ఈ లేఖ‌ను ట్వీట్ చేస్తూ ఈ వార్త నిజం కావ‌చ్చని రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం కాస్తా తీవ్ర చర్చనీయాంశమైంది.

Leave A Reply

Your email address will not be published.