ఆంగ్లో-ఇండియన్ల మాదిరిగా అత్యంత వెనుకబడిన కులకు నామినేటెడ్ పోస్ట్లు ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అత్యంత వెనుకబడిన కులాలు ఇంతవరకు అసెంబ్లీ పార్లమెంట్ గడప తొక్కలేదని అలాంటి కులాలకు ఆంగ్లో-ఇండియన్ల మాదిరిగా నామినేటెడ్ యం.యల్.ఏ/యం.పి లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగుడాల సుదాకర్ ముదిరాజ్ కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాలను  డిమాండ్ చేసారు.బుదవారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలు ఇందుకు అర్హులు కాదా అని ప్రశ్నించారు.పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టిచట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని,       కేంద్ర విద్యాఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని కోరారు.రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్దతిలో ఈ సీట్లు ఇవ్వాలన్నారు.విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లకు నామినేటెడ్ యం.యల్.ఏ లుగాయం.పి లుగా ఇస్తున్నారు.బి.సి ల విద్యాఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలన్నారు.బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని,ఎస్సీ/ఎస్టీ అట్రా సిటీ  యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణభద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలని సుదాకర్ మూడు రాజ్ డిమాండ్ చేసారు.ప్రపంచీకరణసరళీకృతఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం  ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.