ఖండాతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. ఈ నెల 3న ఏకంగా ఖండాతర క్షిపణిని పరీక్షించింది. తాజాగా శుక్రవారం మరోసారి ఐసీబీఎంని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా అనుమాస్పద ఖండాంతర క్షిపణిని పరీక్షించిందని సియోల్‌ సైన్యం వెల్లడించింది. ఇది ప్యాంగాంగ్‌ రూపొందించిన దీర్ఘ శ్రేణి ఆయుధమని, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలుగుతుందని చెప్పింది. దీనితో అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగంతో ఉత్తర కొరియా ఈ ఏడాది ఎనిమిది ఐసీబీఎంలను పరీక్షించినట్లయింది.ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షతో జపాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి చెందిన హొక్సైడో రీజియన్‌లోని ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ సముద్ర జలాల్లో క్షిపణి పడిందని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా చెప్పారు. ఉత్తర కొరియా చర్య ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్నారు.

Leave A Reply

Your email address will not be published.