టిఆర్ఎస్ కాదు ఇకపై బీఆర్ఎస్

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావం

తెరాస రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2001లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2022 అక్టోబర్ 5వ తేదీన కాలగర్భంలో కలిసిపోయింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ బుధవారం హైదరాబాద్లోనే తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1:19 గంటలకు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ ప్రతులను పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రూపంలో పంపించారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తూ 2014లో తెలంగాణ రాష్ట్ర కలను సహకారం చేసుకుంది. 2014 నుండి రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలతో హైదరాబాద్ కు విచ్చేసి బి ఆర్ ఎస్ పార్టీకి మద్దతు పలికారు. ముందుగా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పును తెలియజేస్తూ తీర్మానం చేయగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసి సి బి చైర్మన్ లు ఇతర నాయకులు ఏకగ్రీవంగా పేరు మార్పును ఆమోదించారు. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. దేశ్ కె నే త జిందాబాద్ అంటూ నినాదాలు తెలంగాణ భవన్ లో మారుమోగాయి.

Leave A Reply

Your email address will not be published.