మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్‌కు నోటీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్‌లో అడుగుపెట్టిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను స్థానిక పోలీసులు అడ్డుకొన్న తీరు వివాదాస్పదంగా మారింది. పోలీసుల అంక్షల నేపథ్యంలో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌కే పరిమితం అయ్యారు. ఈ వివాదాస్పద అంశం నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ నేత. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కేసు నమోదు చేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే నోవాటెల్‌లో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తన మూడు పెళ్లిళ్లపై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా జీవితంలో వైవాహిక బంధం విషయంలో కుదర్లేదు. చట్టబద్దంగా విడాకులు తీసుకోవడమే కాకుండా భరణం చెల్లించి వివాహాన్ని రద్దు చేసుకొన్నాం. మీకు ఇష్టమైతే మూడు కాదు.. నాలుగు చేసుకోవచ్చు. నాకు మీలా ఒక భార్యతో కాపురం చేస్తూ.. స్టెప్నీలను మెయింటెన్ చేయడం రాదు అని పవన్ కల్యాణ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు అభ్యంతరకరం. మహిళలను కించపరిచినట్టు ఆయన మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. మహిళల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఆయన బేషరుతగా క్షమాపణ చెప్పాలి అని ఏపీ మహిళా కమిషన్ సుమోటగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటూ నోటీసులు జారీ చేసింది.

 

భరణం ఇస్తే భార్యను వదులుకోవచ్చా?

పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ తరుఫున వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేస్తూ.. మీరు ఇటీవల మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో దుమారం రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే విధంగా మాట్లాడిన మాటలు మహిళాలోకాన్ని షాక్‌కు గురిచేసింది. మీ మాటల్లోని తప్పును తెలుసుకొని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ భావించింది. అయితే మీ నుంచి ఎలాంటి పశ్చత్తాపం కనిపించలేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బ తీసినందుకు మీ నుంచి క్షమాపణలు లేవు అని వాసిరెడ్డి పద్మ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.