రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు సినీ దిగ్గజంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. టాలీవుడ్ లెజెండరీ నటులలో ఆయన తర్వాత ఎవరైనా ఉంటారు. అలాంటి ఎన్టీఅర్ తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కూల్చి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మళ్ళీ ఓడిపోయిన మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.ఇలా నటన నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడిగా ఎన్టీఆర్ అరుదైన గౌరవాన్ని గుర్తింపుని సొంతం చేసుకున్నారు. తరువాత జరిగిన  రాజకీయ పరిణామాలో ఎన్టీఆర్ అధికారానికి దూరం అయినా కూడా తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తిగా ఆతన కీర్తి చిరస్థాయిగా మిగిలిపోతుంది. అయితే భారతరత్న అందుకోవాల్సిన వ్యక్తికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తమకి వ్యతిరేక పార్టీ రాజకీయ నాయకుడు అనే ముద్ర వేసి ఇవ్వలేదనే ప్రచారం ఇప్పటికి ఉంది.ఇదిలా ఉంటే ఇన్నేళ్ళ తర్వాత ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వనుంది. వంద రూపాయిల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ వేసి రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. ఇక దీనికి సంబంధించి బీజేపీ నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరితో ప్రత్యేకంగా భేటీ అయ్యి నమూనాని చూపించినట్లు తెలుస్తుంది. ఇక నమూనాకి ఆమె కూడా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. ఇలా రిజర్వ్ బ్యాంకు ప్రముఖ లెజెండ్రీ వ్యక్తుల చిత్రాలతో నాణేలని రిలీజ్ చేస్తుంది. ఈ సారి సీనియర్ ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయిల నాణెం రిలీజ్ చేయడానికి సిగ్నల్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. తెలుగు దేశం పార్టీ కూడా అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ కి జాతీయ స్థాయిలో గౌరవం అందించే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు.అయితే బీజేపీ ప్రభుత్వంలో పురందరేశ్వరి భాగం కావడంతో ఇప్పుడు ఆమె కల్పించుకోవడంతో ఎన్టీఆర్ బొమ్మతో నాణెం విడుదల చేసి ఆయనకి గౌరవం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.