వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్నవన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను(ICC World Cup 2023) ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవబర్‌ 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 8న అస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.దేశంలోని 10 స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 46 రోజుల పాటు మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈ టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనుంది. ఇలా వరల్డ్‌ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ.. తొలుత ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు పంపి.. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాక వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ప్రస్తుతం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచినట్లు జట్లు కూడా టోర్నీకి అర్హత సాధిస్తాయి.ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ 2019లో ఫైనల్‌లో ఆడిన జట్ల మధ్య మ్యాచుతో అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. రన్నరప్‌ జట్టు న్యూజిలాండ్ ఈ మ్యాచులో తలపనున్నాయి. అక్టోబర్ 5న జరిగే ప్రారంభ మ్యాచుకు, నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచుకూ అహ్మదాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. సెమీఫైనల్ మ్యాచులు ముంబయి, కోల్‌కతా వేదికగా జరుగుతాయి.టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం పది టీమ్‌లు ఉండగా.. ఒక జట్టు మిగతా 9 టీమ్‌లతో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచు నవంబర్ 12న ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తొలి మ్యాచ్‌‌ ద్వారా భారత జట్టు కప్పు వేటను ప్రారంభించనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 15న టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా మ్యాచు జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.