స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చుటకు అధికారులు సహకరించాలి-    

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  విద్యానగర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్లో  స్వాతంత్ర సమరయోధుల  ఆశయాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా  సమావేశంలో స్వాతంత్ర సమరయోధుడి  పది ఎకరాల భూమి సమస్యను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరిసత్యనారాయణగౌడ్ రాజ్యసభ సభ్యుడు  ఆర్ కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ  మనకు స్వాతంత్రం  తీసుకొచ్చిన స్వతంత్ర సమరయోధులను గౌరవించి  అట్టి ఆశయాలను నెరవేర్చుటకై ముందుకు వచ్చిన స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు  కోవూరి మొగులయ్య గౌడ్  కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన  ఫ్రీడమ్ ఫైటర్  కోవూరి మొగలయ్య గౌడ్  మెమోరియల్ ట్రస్ట్  ఆశయాలకు  అనుగుణంగా సదాశివపేట తాసిల్దార్,, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రభుత్వ యంత్రాగం  సహకరించి  తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా  ముందుకు కొనసాగాలని  విజ్ఞప్తి చేశారు.  అదేవిధంగా  స్వతంత్ర సమరయోధుడు యొక్క విలువలపట్ల  అవగాహన లేకుండా  మూర్ఖత్వంతో మేదిలే  ప్రభుత్వ అధికారులను  ఈ యొక్క సమాజం  మరియు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ  క్షమించని విధంగా  చరిత్ర హీనులుగా  మిగిలిపోతారని  హెచ్చరించారు.  మరియు  స్వతంత్ర సమరయోధుడు కలలుగన్న ఆశలకు  అనుగుణంగా పనిచేసే అవకాశం రావడం గొప్ప పనిగా భావించి  ప్రభుత్వ అధికారులు మెదలాలని  కొనియాడారు.  ఈ యొక్క  సమావేశంలో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్, అంజి,  సతీష్, రామకృష్ణ  మరియు అధిక సంఖ్యలో  బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.