10న కలెక్టరేట్ ల ముందు నిరసన దీక్షలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈనెల 10వ తేదీన సోమవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ  రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఈ దీక్షలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనాలని టీఎస్ జి ఆర్ ఇ ఎ జి.దామోదర్ రెడ్డి, ప్ర్కభుత్వ పెన్షనర్స్ దారుల జేయేసి చర్మెన్ కే లక్ష్మయ్యలు పిలుపునిచ్చారు. నేడు టిఎన్జి రాష్ట్ర కార్యనిర్వాక వర్గ సమావేశం హైదరాబాదులోని బడి చౌడిలోని  సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి అధ్యక్షులు జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ సి.చంద్రశేఖర్, టీఎస్ జి ఆర్ ఇ ఎ ట్రెజర్ రాజేందర్ బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ను అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కల్పించాలని, పెన్షనర్స్ అందర్నీ ఆదాయపు పన్ను  నుండి మినహా ఇంపు  ఇవ్వాలని, మూడు డిఏ లను వెంటనే ప్రకటించి బకాయిలు విడుదల చేయాలని, పెన్షన్ కమ్యూనికేషన్ ను 15 సంవత్సరములకు బదులుగా 12 సంవత్సరాలకే పరిమితం చేయాలని ప్రతినెలా ఒకటో తేదీని పెన్షన్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్,ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.