సెప్టెంబర్ 10 న సూర్యాపేటలో బీసీ జన గర్జన బహిరంగ సభ     

- బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ఆధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిసి ల ఆత్మా గౌరవం, బిసి ల హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్  10వ తేదిన సూర్యాపేటలో బీసీ జన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ఆధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్ తెలిపారు  శనివారం సూర్యాపేట లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సూర్యాపేట పట్టణం లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్  ఆవరణ లోజరిగే బీసీ జన గర్జన బహిరంగ సభను సూర్యపేట నియోజకవర్గ ప్రజలు అన్ని రాజకీయ పార్టీ లా, బీసీ మహిళలు, బీసీ జెడ్పీటీసీలు, బీసీ  ఎంపీపీలు, బీసీ కౌన్సిలర్లు, బీసీ సర్పంచులు ,బీసీ ఎంపీటీసీలు బీసీ వార్డు మెంబర్లు, బీసీ ఉద్యోగులు,  బీసీ విద్యార్థి  సంఘం నాయకులు, బీసీ మేధావులు, బీసీ యువజన నాయకులు, ఎంబీసీ నాయకులు ,  బీసీ జర్నలిస్టులు,బీసీ కార్మికులు కర్షకులు, హాజ రావుతున్నట్లు తున్నట్లు తెలిపారు.రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలను ప్రకటించాలని జనాబా ప్రాతిపదికన బిసి లకు 62 శాతం అసంబ్లి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని, బిసిలకు రాజ్యదికారం లో సమాన వాటా కల్పించాలనిడిమాండ్ చేసారు. అందుకు  బీసీ కుల గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 75 ఏళ్ళుగా భారతదేశంలో అన్ని పదవులు, సంక్షేమ పథకాలు తమరే అనుభవించారని.. బీసీలకు మాత్రం ఏం దక్కడం లేదని విమర్శించారు. అలాగే  బిసి ఉద్యోగులలో రిజర్వేషన్ కల్పించాలని, పార్లమెంట్ లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలన్నీ తమ పద్ధతిని మార్చుకోవాలని హితవుపలికారు. పేద కులాల అభివృద్ధి కోసం అందరూ ముందుకు రావాలన్నారు. రానున్న అసంబ్లి ఎన్నికలకు సంబంధించి కెసిఆర్ ప్రభుత్వం బిసి లకు తక్కువ సీట్లు ఇచ్చి బిసిలను అనుగ ద్రొక్కే చర్యలకు పాల్పడిందని బొల్క వెంకట్ యాదవ్ విమర్శించారు   ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, సతీష్ నాయి బ్రాహ్మణ, కిషోర్ గౌడ్, సందీప్ నాయుడు, కరుణాకర్ ముదిరాజ్, ప్రశాంత్ రజాక్, నవీన్ కుమ్మరి, అంజి యాదవ్, వివిధ అన్ని కులాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.