విద్యుత్ సవరణ బిల్లుపై వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే విద్యుత్ సవరణ బిల్లుకు వైసీపీ ఆమోదం తెలిపితే వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ఉందని రాజకేయ పరిశీలకులు పేర్కొంటున్నారు.అంటీ కాదు  రైతు సంఘాల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు తప్పవు. పోనీ మద్దతివ్వకుండా ఉండటం కూడా కుదరదు. ఎందుకంటే కీలకమైన బిల్లు విషయంలో వైసీపీ మద్దతివ్వకపోతే ఏం జరుగుతుందో.. బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఏం చేయగలరో వైసీపీకి తెలుసంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో వైసీపీ భాగస్వామ్య పార్టీ కాదు. అయినప్పటికీ మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ వైసీపీ మద్దతిస్తూ వస్తోంది. కొన్నిటి విషయాల్లో కేంద్రం అడగకపోయినా సరే వైసీపీనే ముందుగా మద్దతిచ్చిందనే అభియోగాలూ ఉన్నాయి. మరోవైపు ఏపీ సీఎం జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా జరగకుండా తన బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకే బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తన కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడుతున్నారని మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తెర లేచింది. డిసెంబర్ నుంచి 29 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉందని అంటున్నారు.డిసెంబర్ నుంచి జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 బిల్లుల వరకు ప్రవేశపెట్టనుందని సమాచారం. వీటిలో విద్యుత్ సవరణ బిల్లు వ్యక్తిగత సమాచారం భద్రత బిల్లు వన్యప్రాణుల సంరక్షణ సవరణ బిల్లు న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు తదితరాలు ఉన్నాయని చెబుతున్నారు.అయితే పార్లమెంటు రెండు సభల్లో బీజేపీకి ఈ బిల్లులను ఆమోదించుకోగల స్థాయిలో సభ్యులున్నారు. రాజ్యసభలో మిత్రపక్షాలతో కలిపి బీజేపీకి బొటాబొటి మెజారిటీ ఉంది. మరోవైపు మొదటి నుంచి ఒడిశాలోని బిజూ జనతాదళ్ అంశాల ప్రాతిపదికగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. మరోవైపు వైసీపీ.. బీజేపీ ప్రభుత్వం అడగాలే తడవుగా దేనికైనా తమ మద్దతు రెడీ అన్నట్టు వ్యవహరిస్తోంది.అయితే ఈసారి వైసీపీకి సంక్షిష్ట సమస్య ఎదురుకానుందని అంటున్నారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకే ఈ బిల్లు తెస్తున్నామని కేంద్రం చెబుతోంది.అయితే.. ఈ బిల్లు వల్ల రైతులకు నష్టం కలుగుతుందని వ్యవసాయ మోటార్లకు మోటార్లు బిగిస్తారని ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం రైతుల నడ్డి విరగకొట్టడానికి ప్రయత్నిస్తోందని ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.తమ రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి తాము ఒప్పుకోబోమని తెలంగాణ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు ముఖ్యమంత్రులు.. కేసీఆర్ మమతా బెనర్జీ హేమంత్ సోరెన్ అరవింద్ కేజ్రీవాల్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం విద్యుత్ పంపిణీ సవరణ చట్టం చేస్తే రైతుల వ్యవసాయ మోటార్లు/బోర్లకు స్మార్ట్ మీటర్లు పెడతారు. దీంతో ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్టేనని అంటున్నారు. దీంతో రైతులే తమ విద్యుత్ బిల్లులు కట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఒప్పుకోబోమని విస్పష్ట ప్రకటన చేసింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి నష్టం లేదని.. నేరుగా రైతుల ఖాతాల్లోనే విద్యుత్ బిల్లులు చెల్లించడానికి తాము డబ్బులు చెల్లిస్తామని చెబుతోంది.అయితే ఏపీ ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకే సకాలంలో జీతాలివ్వలేకపోతోందని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి దుస్థితిలో రైతులకు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి రైతుల ఖాతాల్లో ఎలా వేయగలదని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం వేసే వరకు రైతులు బిల్లులు చెల్లించకుండా ఉంటే విద్యుత్ కనెక్షన్ను డిస్కంలు తొలగిస్తాయని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.