ఒకవైపు 5జీ సేవలు..మరోవైపు సెల్ ఫోన్లు బ్యాన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒకవైపు 5జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తుండగా మరోవైపు మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేయాలనే నినాదం తెరపైకి వస్తుండటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలోని బన్నీ గ్రామపంచాయతీ తమ గ్రామంలో సెల్ ఫోన్లను బ్యాన్ చేస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించడం చర్చనీయాంశంగా మారింది.ఇదే విషయంపై బన్నీ గ్రామ సర్పంచ్ గజానన్ టేల్ మాట్లాడుతూ.. గ్రామంలోని చిన్నారులు.. యువకులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారని తెలిపారు. వీడియో గేమ్స్.. వెబ్ సైట్ సెర్చ్.. అశ్లీల వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 18ఏళ్లలోపు ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడకుండా నిషేధించాలని తీర్మానించినట్లు తెలిపారు.మొబైల్ ఫోన్లు బ్యాన్ చేయాలనే తీర్మానికి గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని సర్పంచ్ టేల్ తెలిపారు. అయితే దీనిని అమలు చేయడం మాములు విషయం కాదని.. కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కారించుకుంటామని తెలిపారు. అవసరమైతే జరిమానాలను విధిస్తామని ఆయన పేర్కొన్నారు.అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో సెల్ ఫోన్ ను వినియోగించకుండా ఎవరు ఉండటం లేదు. ప్రతీ పనిని మొబైల్ ఫోన్ల ద్వారానే చాకచక చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక గ్రామ పంచాయతీ మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Leave A Reply

Your email address will not be published.