ప్రచారంలో రెండవ రోజు తగ్గని కారు జోరు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/ బాన్సువాడ ప్రతినిధి: ఎన్నికల ప్రచారం ప్రక్రియలో ఆదివారం సైతం రెండవ రోజు కారు జోరులో ఏమాత్రం తగ్గలేదు. బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పలు గ్రామాలు పలు తాండాలలో ప్రచారం కొనసాగించగా ఆయా గ్రామాల తండాల ప్రజలు జేజేలు పలుకుతూ ఆహ్వానం పలికారు.

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ని మండలం సిద్దాపూర్, శ్యాంరావు తాండా, కోకల్ దాస్ తాండా, చల్క తాండా,

గుంటూరు క్యాంప్‌, పైడిమల్, చింతల్ పేట తాండా లలో ప్రచారం కొనసాగించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి,

పాల్గొన్న నాయకులు పోచారం సురేందర్ రెడ్డి బద్యానాయక్, మండల, గ్రామ, తాండాల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు.ప్రచారంలో భాగంగా గత పది సంవత్సరాలలో ప్రతి గ్రామంలో, తాండాలో చేసిన అభివృద్ధి పనులను, అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన పోచారం.

ఈసందర్భంగా జరిగిన ప్రచార సభలలో పోచారం మాట్లాడుతు నవంబర్ 30న జరిగే పోలింగ్ లో మీరు అందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చి బంజారాలకు స్వయం పరిపాలన అందించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ ప్రాంత బంజారాల బతుకులు మార్చడానికి రూ. 200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నదని,

ఈ ప్రాజెక్టుతో 30 తాండాలు, 10 గ్రామాల పరిధిలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందుతుందని,

పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తి చేసి భూములకు నీళ్ళు అందిస్తామని, మీ పిల్లలకు, భవిష్యత్తు తరాలకు నీటి కొరత ఉండదన్నారు.

ఈ ప్రాంతంలో గతంలో రెండు లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమి విలువ ఈరోజు ఇరవై లక్షలు అయిందని,

సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటక కేంద్రం అవుతుందని ఆయన తెలిపారు.

సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో మునిగిన భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములను ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు పోడు భూముల పట్టాలను ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేస్తూ ఇది చారిత్రక నిర్ణయమని అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో 2100 మంది గిరిజనులకు 4500 ఎకరాలకు పోడు పట్టాలను అందించామన్నారు.

మిగిలిన పోడు భూముల రైతులకు కూడా పట్టాలు అందుతాయని,

గిరిజన బాలుర కోసం నస్రుల్లాబాద్ లో గిరిజన బాలుర గురుకులం ఏర్పాటు చేయించానని,

గిరిజన బాలికల గురుకులాన్ని మంజూరు చేయించి రూ. 12 కోట్లతో కోనాపూర్-హన్మాజీపేట సమీపంలో భవనాన్ని నిర్మిస్తున్నామని వ్యాఖ్యానించారు.

రైతుల వద్ద భూమి ఉన్నదని, కష్టపడి పనిచేస్తారు కాని కావలసింది నీళ్ళు, కరంటు, పండించిన తరువాత మద్దతు ధరతో కొనుగోలు చేయడమని,

బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇవన్ని కూడా రైతులకు అందిస్తుందని ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి తెలిపడం జరిగింది.

నియోజకవర్గంలోని.ప్రతి గ్రామంలో మౌళిక వసతులు మెరుగుపరిచామని, ప్రజలకు అవసరమైన సామాజిక వసతులు కల్పించానని,

గ్రామాలలో గల్లిగల్లికి సిసి రోడ్లు వేయించానని, మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నామని, కుల సంఘాలకు ఆత్మీయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు.

రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయని,

మిగిలిన పేదలకు మూడు లక్షల రూపాయల గృహలక్ష్మీ పథకంలో ఇంటిని మంజూరు చేస్తానని,

స్వంత స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అందులో గృహలక్ష్మీ ఇంటిని మంజూరు చేస్తానని,

కులమతాలకు అతీతంగా పేదలు ఎంతమంది కట్టుకుంటాం అన్నా మంజూరు చేస్తానని తెలిపారు.

బాన్సువాడ నియోజకవర్గంలో గుడిసెలు లేని గ్రామాలు, తాండాలు ఉండాలని, బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందని,

భూమి ఉన్న రైతులకు ప్రస్తుతం 5 లక్షల రైతుబీమా అమలు చేస్తున్నామని,

అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా 5 లక్షలతో కేసీఆర్ భీమా-పేదలకు దీమా ప్రారంభిస్తామని,

రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రస్తుతం ఏటా ఎకరాకు రూ..10,000 లు రైతుబంధు వస్తున్నాయని, ఎన్నికల తరువాత రూ.12,000 కు తదుపరి రూ. 16,000 లకు పెంచునున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఉన్న రూ. 2016 పెన్షన్ నూతన ప్రభుత్వంలో రూ. 3016 లకు పెంచుతామని, తదుపరి ఏటా రూ. 500 పెంచుతూ రూ. 5016లు అందిస్తామని,

వికలాంగులకు ప్రస్తుతం ఉన్న రూ. 4016 ల పెన్షన్ ఎన్నికల తరువాత వెంటనే రూ. 5016 లకు తదుపరి రూ. 6016 లకు పెంచుతామని,

అర్హులైన పెన్షన్ అందని మహిళలకు కొత్త ప్రభుత్వంలో సౌభాగ్యలక్ష్మీ పథకం కింది రూ. 3016 లు పంపిణీ చేస్తామని,

రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీతో పాటు రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని,

ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్షా నూటపదహారు రూపాయలు అందుతున్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశాడు.పజలనుద్దేశించి మాట్లాడుతు

మీ అందరి మద్దతు, సహకారంతో బి ఆర్ ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గంలో, రాష్ట్రంలో విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ మీరు అడిగిన అన్ని పనులను చేయిస్తానని తెలిపారు.

గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేశానని నేను మీకు బాకీ లేనని, మీరే నాకు బాకీ పడ్డారని తెలిపారు.

మీరు అందరూ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ ప్రచార ప్రక్రియలో

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని కోకల్ దాస్ తాండా వాసులు అందజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.