మరోసారి తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ లో తెలంగాణ లోని కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన లేదని చెప్పడం తెలంగాణ కు ద్రోహం చేయడమే అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు జవాబుగా కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన ఏది లేదని, భవిష్యత్ లో కూడా అవసరం లేదని చెప్పడం తెలంగాణ హక్కులను కలరాడమే అవుతుంది, ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో మనకు కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన మన హక్కుగా ఉంది అన్నారు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేంద్రం ఇలా అనడం తెలంగాణ ను మోసం చేయడమే అవుతుంది.  ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంపైన పోరాటం చేయకపోవడం వల్లనే నష్టం జరిగింది. మన హక్కులను కాపాడడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ హక్కులు సాధించేందుకు కృషి చేస్తోంది. 60 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తే చిన్న చిన్న పనులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ప్రజలు ఈ విషయాలు గమనించి ఈ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ లకు తగిన గుణపాఠం చెప్పాలని మల్లు రవి రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.