చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో వాదనలు ఇంకా పూర్తి కాలేదు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటు సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే ఇక తీర్పు మాత్రమే మిగిలి ఉండగా.. రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఒకటి.. హౌస్ కస్టడీపై క్లారిఫికేషన్ ఇవ్వాలని కోర్టు కోరడంమరొకటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పత్రాల పరిశీలనకు పిటిషన్ దాఖలు కావడం. ఇరువర్గాల వాదనలు వినడంనిశితంగా పరిశీలించిన తర్వాత ఏసీబీ కోర్టు న్యాయూర్తి.. కస్టడీకి సంబంధించి కొన్ని అంశాలపై క్లారిఫికేషన్ కోరారు. దీంతో లూథ్రా మళ్లీ వాదనలు వినిపించాల్సి వచ్చింది. హౌస్ కస్టడీ ఎందుకు..చంద్రబాబు భద్రత విషయంలో ఉన్న అనుమానాలు ఏంటి..అనే విషయాలను న్యాయమూర్తిగా నిశితంగా మరోసారి లూథ్రా వివరిస్తున్నారు. అయితే.. రెండోసారి మళ్లీ వాదనలు వినిపిస్తున్న లూథ్రా నిశితంగా ఇదివరకటి సుప్రీంకోర్టు తీర్పులు ఉదహరించి మరీ వాదిస్తున్నారు. దీంతో కచ్చితంగా హౌస్ కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివరణ తర్వాత మరో గంటలోపు ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇంకోకటి ఇలా..!

ఇదిలా ఉంటే.. తీర్పుకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున లాయర్లు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు కు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలనకు అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్‌- 207 CRPC కింద అనుమతివ్వాలని పిటిషన్‌లో బాబు లాయర్లు.. కోర్టను కోరారు. అయితే కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే హౌస్ కస్టడీ, బెయిల్‌పై రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలో మళ్లీ డాక్యుమెంట్ పరిశీలనకు పిటిషన్ వేయడంతో కోర్టు ఎలా స్పందిస్తుందో మరి. ఉదయం నుంచి చంద్రబాబుకు జైల్లో భద్రత లేదని లూథ్రా.. భద్రతో విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని సీఐడీ తరఫున పొన్నవోలు వాడివేడిగా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాదనలు పూర్తయ్యాక మళ్లీ న్యాయమూర్తి క్లారిఫికేషన్ అడగటంతో లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.