కొనసాగుతున్న రెడ్ క్రాస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జయంతి ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జిల్లా శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎ. వి. యన్ రెడ్డి , హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ యం. వెంకటేశ్వర్లు,టి యన్ జి ఓ గెజిటెడ్ ఆఫీసర్ ల సంఘం హైదరాబాద్ అధ్యక్షులు కృష్ణా యాదవ్, టిబి-హైదరాబాద్  కన్వీనర్ డా. బి. విజయ్ భాస్కర్ గౌడ్, హైదరాబాద్ అసీప్ నగర్ తహసీల్దార్ షేక్. ఫర్హీన, ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ శ్రీమతి డా. డి. వరలక్ష్మి గారు,రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి, కాంట్రాక్టరు ఎ. వి రావులు పాల్గొన్నారు.  మొదటగా గా 08. వ తేదీన ఉదయం 09.30 గంటలకు, హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి రెడ్ క్రాస్ జెండా ను ఆవిష్కరించి ఈ కార్యక్రమం ను ప్రారంభించారు. తరువాత సేవా భావం ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో ర్యాలీ ను హైదరాబాద్ జిల్లా శాఖ నుండి మాసబ్ ట్యాంక్ చౌరస్తా వరకు విద్యార్థులు తో నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తో రెడ్ క్రాస్ గవర్నమెంట్ బాలికల పాఠశాల లో జె.ఆర్. సి మరియు వై. ఆర్. సీ సర్టిఫికేట్ లను ప్రదానం చేయడం జరుగుతుంది. గవర్నర్ సహాయం తో టి బి పేషెంట్ లకు టిబి ఫుడ్ బాస్కెట్ కిట్స్ ను రెడ్ క్రాస్ జిల్లా శాఖా దగ్గర పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 100 మంది తో రెడ్ క్రాస్ సభ్యత్వo ను చేయాలని మరియు మరింత మంది దాతలు ముందుకు వచ్చి టిబి ముక్త్ భారత్ అభియాన్ పథకం లో భాగమై విరాళాలు అందించి క్షయ వ్యాది రోగులను ఆదుకోవాలని భీమ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం కు రెడ్ క్రాస్ వాలంటీర్లు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.