మూడేళ్లలో ఏపీ లో నిర్మించింది 5 ఇళ్లు మాత్రమే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ లో మూడేళ్లలో నిర్మించింది 5 ఇళ్లు మాత్రమేనన్న కేంద్రం పేర్కొంది. లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నుంచి మూడేళ్లలో పీఎంఏవై పథకం కింద ఏపీలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు కేంద్రం తెలిపింది. పీఎంఏవై కింద ఆయా రాష్ట్రాల్లో నిర్మించిన ఇళ్ల వివరాలపై లోక్‌సభలో సభ్యుల ప్రశ్నకు కేంద్రమంత్రి నిరంజన్‌జ్యోతి సమాధానం ఇచ్చారు. ఏపీకి 2016 నుంచి 1,82,632 ఇళ్లను కేటాయించామని కేంద్రం పేర్కొంది. 2016 నుంచి ఏపీలో 46,726 ఇళ్ల నిర్మాణం జరిగిందని కేంద్రం తెలిపింది. గత మూడేళ్లలో కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని కేంద్రం తెలిపింది. మిగతా 46,721 ఇళ్లు టీడీపీ హయాంలోనే నిర్మించినవేనని కేంద్రం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.