ఒకే ఒక్క నిర్ణయం.. సూడాన్ అతలాకుతలం       

-  400 మందికి పైగా మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒకే ఒక్క నిర్ణయం.. జీవితాన్ని మార్చేస్తుందని అంటారు. అలానే.. ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని అతి పెద్దదేశంగా పరిగణిస్తున్న సూడాన్ను అతలాకుతలం చేస్తోంది. 2021లో చోటు చేసుకున్న రాజకీయ పరమైన కారణాలతో ప్రబుత్వాన్ని కూల్చేసిన సైన్యం.. నియంతృత్వ పాలనను సాగిస్తోంది. అయినా.. ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు రాలేదు. అన్నీ బాగానే సర్దుకుపోతున్నాయి.అయితే.. అనూహ్యంగా సైనిక పాలకులు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు దేశాన్ని ఛిన్నాభిన్నం చేయడం తోపాటు.. రోజుకు కొన్ని వందల మంది మృతి చెందే పరిస్థితి వచ్చింది. సూడాన్లో సైన్యం ఒక కీలక భాగం. అదేసమయంలో పారామిలిటరీ సపోర్ట్ రాపిడ్ ఫోర్స్(పీఎస్ ఆర్ ఎఫ్) మరో భాగం. అయితే.. సైన్యానికి ఉన్న బాధ్యతలు.. బరువు.. రాపిడ్ ఫోర్స్కులేదు. అదేవిధంగా రిటైర్మెంట్ విషయంలోనూ రాపిడ్ ఫోర్స్కు వెసులుబాటు ఉంది.అయితే..అనూహ్యంగా స్థానిక సైనిక నాయకత్వం..ఈ రాపిడ్ ఫోర్స్ను కూడా సైన్యంలో కలిపేస్తామని ప్రకటించింది. అంతే!  ఈ నిర్ణయం తీసుకున్న దరిమిలా.. సైనికులతోనే రాపిడ్ ఫోర్స్ కు వివాదం తలెత్తింది. దీంతో ఇరు పక్షాలు కూడా ఆదిపత్యం కోసం పోరాడుకుంటున్నాయి. ఈ పోరు కూడా ఎక్కడో కాకుండా.. జనారణ్యంలోనే సాగుతుండడం గమనార్హం. ఫలితంగా గత వారం రోజులుగా రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.మానవ ఆవాసాలు.. కార్యాలయాలు ఆసుపత్రులే లక్ష్యంగా ఇరు వర్గాలు కూడా మారణ కాండను కొనసాగి స్తున్నాయి. ఈ దాడుల్లో చిన్నారులు ఎక్కువగా మృతి చెందుతున్నారని ఐక్యరాజ్యసమితిలోని యూనిసెఫ్ విభాగం ఆందోళన వ్యక్తంచేసింది.అంతర్యుద్ధంగా అభివర్ణించిన ఈ పోరులో ఇరు పక్షాలు బలంగా పోరాడుతుండడంతో గగన తలాన్ని సైతం నిలిపివేశారు. ఫలితంగా ప్రపంచ దేశాల ప్రజలను తరలించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.ఎక్కడుంది.. సూడాన్?
సూడాన్ అధికారిక నామం.. రిపబ్లికు ఆఫ్ సూడాన్. ఈశాన్య ఆఫ్రికాలో( ఆఫ్రికా ఖండం)లోనే అతిపెద్ద దేశం. అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భావిస్తారు.  2016లో దేశ జనసంఖ్య 3 కోట్ల 90 లక్షల మంది. అంటే.. మనదేశంలోని రెండు ఈశాన్య రాష్ట్రాలను కలిపితే అంతన్నమాట.  సుడానులో ఇస్లాం మతం ఆధిక్యతలో ఉంది.  2011 నుండి కార్డోఫను బ్లూ నైలు ప్రాంతాలు మతకలహాలకు కేంద్రంగా ఉన్నాయి. 2021లో ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం అధికారం చేపట్టింది.

Leave A Reply

Your email address will not be published.