ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శల వర్షం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. గౌతమ్‌ అదానీ విషయంలో ప్రధాని మోదీ ఇంతవరకు పెదవి విప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీని మౌని బాబాగా అభివర్ణించారు. అయితే, ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్‌ ధనకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌని బాబా అనే పదప్రయోగం మీ హోదాకు తగినది కాదని హెచ్చరించారు.జ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారో తాను అడగ దల్చుకున్నానని, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రధాని పారిశ్రామికవేత్తల విషయంలో ఎందుకుండరని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టే నేతలపట్ల ప్రధాని కటువుగా ఉంటే.. ఈసారి టికెట్‌ వస్తుందో రాదోనని భయపడుతారని, కానీ ప్రధాని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌని బాబాలా ఉంటున్నారని విమర్శించారు.దాంతో రాజ్యసభ చైర్మన్‌ ధన్‌కర్‌ సీరియస్‌ అయ్యారు. అలాంటి పదాలు వాడటం మీ హోదాకు తగినది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి మాటలు సభలోని సభ్యులందరి మాటలను ప్రతిబింబించాలని వ్యాఖ్యానించారు. దయచేసి సభలో హూందాగా మాట్లాడాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.