వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మండలిలో వర్షాలువరదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో మంత్రి వేముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించలేమనిఆపలేమన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రజాప్రతినిధులుఅధికారులు ఫోర్స్‌గా నిలబడ్డారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారనివరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. వర్షాలువరదలపై మండలిలో ప్రభుత్వం ప్రకటన చేసింది. వర్షాలతో 139 గ్రామాల ప్రజలను, 157 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 7,870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 756 చిన్న తరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొంది. చెరువుల పునరుద్ధరణకు రూ.171.1కోట్లు అవసరమని, 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్ధరించినట్లు చెప్పింది. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.253.77కోట్లు అవసరమనిశాశ్వత పునరుద్ధరణకు 1777.47 కోట్లు అవసరమని చెప్పింది. పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి 1517 రోడ్లు దెబ్బతిన్నాయనితాత్కాలిక పునరుద్ధరణకు రూ.177.1కోట్లు అవసరమని తెలిపింది. శాశ్వత పనుల కోసం రూ.1339.03 కోట్లు అవసరమని పేర్కొంది. ఆగస్టు 8వ తేదీ వరకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.