పద్మశాలీలు సహజ సంపన్నులు  

- టీఏపీఎమ్ కన్వీవర్ భారత సుదర్శన్ నేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పద్మశాలీలు సహజ సంపన్నులని, తెలంగాణ పద్మశాలి మహాసభ (టీఏపీఎమ్) కన్వీవర్ భారత సుదర్శన్ నేత అన్నారు.మార్కండేయ పద్మశాలి సేవా సంఘం – బొల్లిగూడెం’ వారి నూతన సంవత్సర క్యాలండర్ – 2024′ ఆవిష్కరణలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన భారత సుదర్శన్ నేత మాట్లాడుతూ పద్మశాలీలు సహజ సంపన్నులని, పద్మశాలీలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక, విద్యా,వైద్య రంగాల్లో మరింతగా రాణించాలన్నారు. రాజకీయాల్లో తమ వాటాను దక్కించుకోవడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని సుదర్శన్ నేత పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా పద్మశాలీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో -తెలంగాణ పద్మశాలి మహాసభ (టీఏపీఎమ్)’ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. టీఏపీఎమ్’ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని, తమ సహాయ సహకారాలను అందించాలని భారత సుదర్శన్ కోరారు. ప్రతిభ ఉండి చదువుకోలేకపోతున్న పద్మశాలి యువతీ యువకులకు అండదండలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అంతకు ముందు సంఘం అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్,గౌరవ సలహాదారులు మహేషుని లక్ష్మయ్య నేత,ప్రదాన కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యక్షులు పున్న బాల రాజ్ తో కలిసి క్యాలెండరు ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో  పాటు పద్మశాలి సంఘం నాయకులు మెరుగు శ్రీహరి నేత, బింగి ప్రవీణ్ కుమార్ నేత మెరుగు శ్యాం కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.