పద్మశాలీలు యాచించే స్థాయి నుండి శాశించే స్థాయికి ఎదగాలి

- పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉద్యోగ వాణిజ్య తదితర రంగాల్లో పద్మశాలీలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ నేత కార్మికులుగా జీవనం సాగిస్తున్న పద్మశాలీలు దుర్బల జీవితాన్ని గడుపుతున్నారని యాచించే స్థాయి నుండి శాశించే స్థాయికి ఎదగాలని  పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు పిలుపు నిచ్చారు..బోడుప్పల్ మునిసిపాలిటి లోని చంగిచెర్ల బోల్లిగుడెం శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా  సంఘం రూపొందించిన 2023 క్యాలెండర్ ను పెద్దమ్మ గుడి వద్ద ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి స్తానిక కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పద్మశాలీలు అభివృద్ధి లేదని ఒక్క రాజకీయంగా అని అన్నారు.పద్మశాలిలు  చైతన్యవంతులై రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే ముందుకెళ్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలి కోసం ప్రవేశపెట్టె అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పద్మశాలిలకు అందడం లేదని,నేత  కార్మికుల పేరుతో కార్మికులు కానివారు లబ్ధి పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనితో నిజమైన కార్మికులు లబ్ది పొందటం లేదన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే చట్టసభల్లో పద్మశాలి గురించి మాట్లాడే నాయకుడే లేడన్నారు.పద్మశాలిలు యాచించే స్థాయి నుంచి  శాసించే స్థాయికి ఎదగాలని బాబురావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘాలు డేటాను కవర్ చేసి మన ఉనికిని చాటాలని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న సంఘం గౌరవ అధ్యక్షులు మహేశుని లక్ష్మయ్య  నేత మాట్లాడుతూ పద్మశాలీల ఉనికిని కాపాడుకోవాలంటే వారి పేరు చివరన ‘నేత’ లేక ‘పద్మశాలి’ అని పెట్టుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. అలాంటప్పుడే పద్మశాలీలు ఉనికిని చాటుకోగలమన్నారు. సంఘం అధ్యక్షులు రచ్చ  శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ దుర్గమ్మ తో పాటు పద్మశాలి సంఘం నేతలు సాయిని అమృతం,వనమాల శంకర్, మున్సిపాలిటీ చెందిన కార్పొరేటర్లు బింగి జంగయ్య, కొత్త కిషోర్ గౌడ్,కొంగల్ రావు, పడతమ్ లోకేష్,,సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ సత్తయ్య, పున్న కృష్ణయ్య, రాపో రమేష్, గుర్రం రామదాస్, వంగరి విటల్ తో పాటు సంఘం ఉపాధ్యక్షులు , పున్నబాలరాజ్,గోషిక  వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎలిగేటి దేవేందర్, కోశాధికారి రచ్చ వెంకటేష్, గుత్తి శంకర్, సూరజ్ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి రవి చంద్ర, కోశాదికారి కపిల్ తదితరులు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.