బోర్లం పాఠశాలలో తల్లితండ్రుల సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ ఆదేశాల మేరకు ఈరోజు బోర్లమ్ ప్రాథమిక పాఠశాలలో FLN పై తల్లి తండ్రులు సమావేశం శనివారం నిర్వహించారు. ప్రతి తరగతి విషయాల వారిగా విద్యార్థులతో పాఠ్య ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా ప్రదానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ విద్యార్ధులను ప్రతి రోజు పాఠశాలకు పంపాలని,ఇతర కారణాలతో విద్యార్థులను వెంటపెట్టకుని ఇతర గ్రామాలకు తీసుకెళ్లకూడదని త ద్వారా విద్యార్థుల తరగతిలో చెప్పే విషయాలలో వెనకబడిపోతున్నారని,ఇలా కాకుండా మీ ఇళ్ళలో ఆహ్లాదకరమైన వాతవరణనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ఇంటి వద్ద ఇచ్చిన హోమ్ వర్క్ ని పూర్తి చేసే విధంగా చూడాలని,విద్యార్థులను TV మరియు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రజినీకాంత్, అయ్యాల సంతోష్, స్వప్న, మౌనిక, SMC కమిటీ సభ్యులు vittal మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.