ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు పవన్ కల్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని, తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని పవన్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం.. అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.