చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో గత 53 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు ఏపీ హైకోర్టు నేడు మధ్యంతర బెయిల్ ను జారీ చేసింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ కోరగా.. ఆయన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మొత్తానికి చంద్రబాబు జైలు నుండి బ‌య‌ట‌కు రానున్నారు. కాగా.. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రబాబు ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమనీ, చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దామని జనసేనాని పేర్కొన్నారు.  ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఐదు షరతులతో పెట్టింది. చిక్సిత అనంతరం ఆయనను నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో సూపరింటెండెంట్ ముందు స్వయంగా లొంగిపోవాలని హైకోర్టు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.