చలి తీవ్రతకు వణుకుతున్న ప్రజానీకం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతిసంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వ తీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ  ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయ ని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటు న్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతా యని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు.ఇక, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్‌, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రా ష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశంఉందని వెల్లడిరచింది.

Leave A Reply

Your email address will not be published.